ఐఐటీ మద్రాస్‌లోని బ్రెయిన్‌ సెంటర్‌కు రూ.41 కోట్ల విరాళం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌(ఐఐటీఎం)లోని సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌కు ఐఐటీఎం పూర్వ విద్యార్థి, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు ప్రేమ్‌వత్స 5 మిలియన్ల యూఎస్‌ డాలర్లు(సుమారు రూ.41 కోట్లు) విరాళంగా అందించారు.

Published : 19 Jun 2024 06:07 IST

వడపళని, న్యూస్‌టుడే: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ మద్రాస్‌(ఐఐటీఎం)లోని సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌కు ఐఐటీఎం పూర్వ విద్యార్థి, కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు ప్రేమ్‌వత్స 5 మిలియన్ల యూఎస్‌ డాలర్లు(సుమారు రూ.41 కోట్లు) విరాళంగా అందించారు. ఈ మేరకు ఐఐటీఎం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ప్రేమ్‌ 1971లో ఐఐటీఎంలో చదివారు. కెమికల్‌ ఇంజినీరింగ్‌లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సుధా గోపాలకృష్ణన్‌ బ్రెయిన్‌ సెంటర్‌ మానవ మెదడులోని సెల్యులార్‌ స్థాయిపై పరిశోధనలు చేస్తోంది. ఈ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రేమ్‌ సహకారం అందించినట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు