41 విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకే రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం ఈ-మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చిన వెంటనే తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది అవి ఉత్తుత్తివే అని తేల్చారు.

Published : 19 Jun 2024 05:52 IST

ఉత్తుత్తి ఈ-మెయిళ్లని తేల్చిన భద్రతా సిబ్బంది
ఆకతాయిల కోసం వేట

దిల్లీ: దేశవ్యాప్తంగా 41 విమానాశ్రయాలకు ఒకే రోజు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం ఈ-మెయిళ్ల ద్వారా బెదిరింపులు వచ్చిన వెంటనే తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది అవి ఉత్తుత్తివే అని తేల్చారు. ఆకతాయిల కోసం వేట ప్రారంభించారు. ఈ బెదిరింపుల కారణంగా కొన్ని గంటలపాటు విమానాశ్రయాల్లో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో ఒకే మెయిల్‌ ఐడీ నుంచి హైదరాబాద్‌ సహా అన్ని విమానాశ్రయాలకు మెయిళ్లు వచ్చాయి. ‘కేఎన్‌ఆర్‌’ అనే ఆన్‌లైన్‌ గ్రూపు ఈ బెదిరింపు మెయిళ్ల వెనుక ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.  మంగళవారం విమానాశ్రయాలకు పంపిన మెయిళ్లలో ‘హలో.. విమానాశ్రయాల్లో బాంబులను దాచి ఉంచాం. అవి పేలనున్నాయి. మీరంతా మరణించడం ఖాయం’ అని ఉంది. చెన్నై నుంచి ముంబయి వెళ్లే ఇండిగో విమానానికి, ముంబయి నగరంలో దాదాపు 60 సంస్థలు, కార్యాలయాలకు సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని