పార్లమెంటులో వ్యూహంపై సీనియర్‌ మంత్రుల భేటీ

త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ మంత్రులు సమాలోచనలు జరిపారు.

Published : 19 Jun 2024 05:56 IST

రాజ్‌నాథ్‌ అధ్యక్షతన సమాలోచనలు

దిల్లీ: త్వరలో ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో కేంద్రం అనుసరించాల్సిన వ్యూహంపై సీనియర్‌ మంత్రులు సమాలోచనలు జరిపారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ అధ్యక్షతన మంగళవారం దిల్లీలో జరిగిన ఈ భేటీలో ఎగువ, దిగువ సభలకు సంబంధించిన అంశాలను చర్చించుకున్నారు. ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం, వచ్చే అయిదేళ్లకు ఎన్డీయే ప్రభుత్వ దార్శనికతను అందులో వివరించడానికి చేర్చాల్సిన అంశాలపై మాట్లాడుకున్నారు. రాజ్‌నాథ్‌  అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో సీనియర్‌ మంత్రులు ఎస్‌.జైశంకర్, మనోహర్‌లాల్‌ ఖట్టర్, పీయూష్‌ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు. 18వ లోక్‌సభ ఈ నెల 24న కొలువుదీరనుంది. తొలుత సభ్యుల ప్రమాణం, ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక ఉంటుంది. 27న పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి  ప్రసంగిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని