ఆంగ్లమాధ్యమ పాఠశాలలపై మోజు ఆత్మహత్యా సదృశమే!

దేశంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం మాతృభాషలో నాణ్యమైన విద్యను అందిస్తున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమ పాఠశాలల పట్ల ఆకర్షితులవడం ఆత్మహత్యా సదృశమేనని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ డీపీ సక్లానీ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 19 Jun 2024 05:57 IST

ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ డి.పి.సక్లానీ వ్యాఖ్య

దిల్లీ: దేశంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం మాతృభాషలో నాణ్యమైన విద్యను అందిస్తున్నప్పటికీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆంగ్లమాధ్యమ పాఠశాలల పట్ల ఆకర్షితులవడం ఆత్మహత్యా సదృశమేనని ఎన్సీఈఆర్టీ డైరెక్టర్‌ డీపీ సక్లానీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు లేనప్పటికీ ఇంగ్లీషు మీడియం పట్ల మోజుతో అటువైపే మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ప్రాథమిక దశలో విద్యార్థులకు మాతృభాషలో బోధించడం ద్వారా వారు తమ మూలాలను త్వరగా ఆకళింపు చేసుకుంటారని, మరింత మెరుగ్గా పలు విషయాలను నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. కేంద్ర విద్యామంత్రి చొరవతో ఒడిశాలో రెండు గిరిజన భాషల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ప్రవేశపెట్టగా అది మెరుగైన ఫలితాలు ఇచ్చిందని చిత్రాలు, కథలు, పాటలతో చిన్నారులు నాణ్యమైన అభ్యాస ఫలితాలను సాధించారని ఉదహరించారు. ప్రస్తుతం తాము 121 స్థానిక భాషల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తున్నామని సక్లానీ పేర్కొన్నారు. నూతన విద్యా విధానం-2020(ఎన్‌ఈపీ-2020) సైతం కనీసం 5వ తరగతి వరకైనా మాతృభాషలో విద్యాబోధన జరగాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు