కార్యకర్తతో కాళ్లు కడిగించుకొని.. వివాదంలో కాంగ్రెస్‌ నేత

మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బురద కాళ్లతో కారులో కూర్చొని ఉండగా ఓ పార్టీ కార్యకర్త ఆయన కాళ్లను కడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

Published : 19 Jun 2024 05:58 IST

ముంబయి: మహారాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు నానా పటోలే వివాదంలో చిక్కుకున్నారు. ఆయన బురద కాళ్లతో కారులో కూర్చొని ఉండగా ఓ పార్టీ కార్యకర్త ఆయన కాళ్లను కడుగుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  భాజపా నేత షెహజాద్‌ పూనావాలా ఈ వీడియోను షేర్‌ చేస్తూ కాంగ్రెస్‌ నాయకులది నవాబీ, ఫ్యూడల్‌ మనస్తత్వం అని దుయ్యబట్టారు. ఈ విధంగా చేసినందుకు నానా పటోలే, కాంగ్రెస్‌ పార్టీ ఆ కార్యకర్తకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. వీడియోపై నానా పటోలే స్పందిస్తూ ‘‘ఓ సభకు వెళ్లినప్పుడు నా కాళ్లకు బురద అంటుకుంది. ఓ కార్యకర్తను నీళ్లు తీసుకురమ్మంటే తీసుకువచ్చాడు. అతడు నీళ్లు పోస్తుంటే కాళ్లు కడుక్కున్నాను. నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను. బురదలో తిరగడం నాకు కొత్త కాదు. ఇలాంటి ఆరోపణలతో బాధపడట్లేదు... కొందరు నాయకులు పార్టీ కార్యకర్తలతో తలకు, కాళ్లకు మర్దనా చేయించుకుంటున్నారు... వారి వీడియోలు ఎందుకు చూపించట్లేదు? ఏదేమైనా నాకు పబ్లిసిటీ ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని