‘నాన్నా.. ఒక్కసారి రావా’

దేశసేవలో నిమగ్నమై ఉన్నా.. తమ కోసం పరిగెత్తుకొచ్చే తండ్రి ఎందుకు రావడం లేదో ఆ చిన్నారి అర్థం చేసుకోలేకపోతున్నాడు.

Updated : 22 Jun 2024 14:34 IST

అమరుడైన తండ్రి కోసం చిన్నారి వాయిస్‌ మెసేజ్‌లు

దిల్లీ: దేశసేవలో నిమగ్నమై ఉన్నా.. తమ కోసం పరిగెత్తుకొచ్చే తండ్రి ఎందుకు రావడం లేదో ఆ చిన్నారి అర్థం చేసుకోలేకపోతున్నాడు. సుమారు 9 నెలల క్రితమే అమరుడైన తన నాన్న కోసం.. వాయిస్‌ మెసేజ్‌లు పంపిస్తూనే ఉన్నాడు. తండ్రి కోసం ఆ తనయుడు పడుతున్న ఆవేదన ప్రతిఒక్కరినీ మెలిపెడుతోంది.  
19వ రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన కర్నల్‌  మన్‌ప్రీత్‌సింగ్‌ కమాండింగ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో కొకెన్‌నాగ్‌కు చెందిన గడోల్‌ అడవుల్లో గత ఏడాది సెప్టెంబరులో ఉగ్రవాదుల్ని మట్టుపెట్టే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. మన్‌ప్రీత్‌కు కుమారుడు, కుమార్తె. వారి ఎదుటే తండ్రి అంత్యక్రియలు జరిగినా.. ఆయన రాడనే విషయాన్ని వారు ఇంకా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే ఆ పసి హృదయాలు తండ్రి కోసం తల్లడిల్లుతున్నాయి. ఏడేళ్ల కుమారుడు కబీర్‌.. ‘‘నాన్నా ఒకసారి ఇంటికి రా.. తర్వాత డ్యూటీకి వెళ్దువు గానీ’’ అంటూ మన్‌ప్రీత్‌ వాడిన ఫోన్‌ నంబర్‌కు వాయిస్‌ మెసేజ్‌లు పంపుతున్నాడు. వీడియో కాల్‌ చేయమని అడుగుతున్నాడు. వాళ్ల అమ్మకు వినిపించకూడదని గుసగుసలాడుతూ వాటిని పంపిస్తున్నాడట. ఆ పిల్లాడి తపన నెట్టింట్లో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని