సంక్షిప్త వార్తలు

ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక, మానసిక ఆరోగ్య ప్రదాయనిగా, ఒత్తిడి నివారిణిగా యోగా విశిష్టత ఎనలేనిది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌ సహా పలు దేశాలు ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి.

Updated : 21 Jun 2024 06:08 IST

ఆరోగ్య యోగా

ప్రపంచ మానవాళికి మన దేశం ఇచ్చిన కానుక యోగా. శారీరక, మానసిక ఆరోగ్య ప్రదాయనిగా, ఒత్తిడి నివారిణిగా యోగా విశిష్టత ఎనలేనిది. నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారత్‌ సహా పలు దేశాలు ప్రత్యేక వేడుకలు, ప్రదర్శనలను నిర్వహిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్‌లో ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 


అంతర్జాతీయ వృద్ధిలో ఆసియా ప్రధాన భూమిక! 

-అమితాబ్‌ కాంత్, నీతి ఆయోగ్‌ మాజీ సీఈవో 

విష్యత్‌ ప్రపంచ వృద్ధి గ్లోబల్‌ సౌత్‌ దేశాలపైనే ఆధారపడి ఉంది. కానీ కాలంచెల్లిన ఆర్థిక వ్యవస్థలు ఆ దేశాలను ముందుకు వెళ్లనివ్వడం లేదు. రాబోయే 2-3 దశాబ్దాల్లో దాదాపు నాలుగింట మూడొంతుల అంతర్జాతీయ వృద్ధి మధ్య, స్వల్ప ఆదాయ దేశాల ద్వారానే  రాబోతోంది. ఇందులో ఆసియా ప్రధాన భూమిక పోషించబోతోంది. 


మితిమీరిన శిక్షణతో  ప్రతికూల ప్రభావాలు 

- కౌశిక్‌ బసు, ఆర్థికవేత్త

మితిమీరిన శిక్షణ వల్ల కొన్ని ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. వ్యక్తుల సహజ, ఇంగిత జ్ఞానాన్ని అది దెబ్బతీసే ముప్పుంటుంది. దాన్నే థార్‌స్టీన్‌ వెబ్లెన్‌ ‘శిక్షిత అసమర్థత’గా నిర్వచించారు. 


భారత్‌కు చరిత్ర ఎక్కువ లేదనడం విడ్డూరం

- డేవిడ్‌ ఫ్రాలీ, రచయిత

ప్రపంచంలో మరే దేశానికీ లేనంతగా భారతదేశానికి సంబంధించిన పురాతన చరిత్ర, దాన్ని పాలించిన రాజవంశాల వరుస క్రమం వేదాలు, పురాణాల ద్వారా లభ్యమవుతున్నాయి. ఆధునిక భౌతికశాస్త్ర ఆవిర్భావానికి ముందే విశ్వం గురించి అనేక కీలక అంశాలను ఈ గడ్డపై ఖగోళ శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయినప్పటికీ భారత్‌కు చరిత్ర ఎక్కువ లేదని, విశ్వం గురించి ఆ దేశానికి అవగాహన తక్కువ అని పలువురు ప్రచారం చేస్తుండటం విడ్డూరం. 


వాయుకాలుష్యంతో పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు 

- ఐక్యరాజ్య సమితి  

ప్రపంచవ్యాప్తంగా రెండో అతిపెద్ద మృత్యుకారకంగా వాయు కాలుష్యం అవతరించింది. ఈ కాలుష్యం ప్రధానంగా ఐదేళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. నెలలు  నిండక ముందే కాన్పులు కావడం, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, ఆస్తమా బారిన పడటం, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడటం వంటి ముప్పులను పెంచుతోంది.


చిత్ర వార్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని