ప్రచార పిచ్చి ముదిరి.. ప్రాణాంతకంగా రీల్స్‌!

సామాజిక మాధ్యమాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకునేందుకు కొందరు రీల్స్‌ పేరుతో దుస్సాహసాలకు తెగిస్తున్నారు.

Published : 21 Jun 2024 06:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమాల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ పేరు తెచ్చుకునేందుకు కొందరు రీల్స్‌ పేరుతో దుస్సాహసాలకు తెగిస్తున్నారు. ప్రమాదకర విన్యాసాలకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్న ఉదంతాలూ అనేకం. ఇలా రీల్స్‌ మోజులో పడిన ఇద్దరు టీనేజర్లలో ఓ యువతి ఎత్తయిన భవనం నుంచి వేలాడుతుండగా.. మరో యువకుడు పైనుంచి ఆమె చేతిని పట్టుకున్న వీడియో తాజాగా వైరల్‌ అవుతోంది. కిందనున్న హైవేపై భారీ వాహనాలు వెళుతున్నాయి. ఏ మాత్రం పట్టు జారినా యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఈ తతంగాన్ని వారి స్నేహితులు కెమెరాల్లో చిత్రీకరించారు. మహారాష్ట్రలోని పుణెలో ఇది జరిగినట్లు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని