రామాయణం నాటికతో అపహాస్యం

ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన నాటిక వివాదాస్పదమైంది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

Published : 21 Jun 2024 06:07 IST

ఐఐటీ బాంబే విద్యార్థులకు జరిమానా

ముంబయి: ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన నాటిక వివాదాస్పదమైంది. రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన తీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం చర్యలకు దిగింది. ఈ ఏడాది మార్చి నెలాఖరున ఐఐటీ బాంబేలో వార్షిక కళా ఉత్సవం జరిగింది. కొందరు విద్యార్థులు ‘రాహోవన్‌’ పేరుతో నాటిక ప్రదర్శించారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడి పేర్లను నేరుగా ఉపయోగించనప్పటికీ.. అరణ్యవాసంలోని కొన్ని ఘట్టాలను పోలిన సన్నివేశాలతో దీన్ని రూపొందించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నాటికలో విద్యార్థులు వాడిన భాష, హావభావాలు అనుచితంగా ఉండటంతో రామాయణాన్ని కించపరిచారని విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఐఐటీ బాంబే యాజమాన్యం ఓ కమిటీ ద్వారా దర్యాప్తు జరిపి 8 మంది విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. సీనియర్లకు రూ.1.2 లక్షల చొప్పున జరిమానా విధించి, జిమ్‌ఖానా అవార్డులకు అనర్హులని ప్రకటించింది. జూనియర్లకు రూ.40 వేల చొప్పున జరిమానాతోపాటు హాస్టలు సదుపాయాలు పొందడంపై నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని