చీనాబ్‌ వంతెనపై మెము రైలు పరుగు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై తొలిసారిగా గురువారం ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై ఎనిమిది పెట్టెల మెము రైలు విజయవంతంగా పరుగు తీసింది.

Updated : 21 Jun 2024 06:11 IST

రియాసీ : ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై తొలిసారిగా గురువారం ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్‌ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై ఎనిమిది పెట్టెల మెము రైలు విజయవంతంగా పరుగు తీసింది. రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ‘ఎక్స్‌’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైళ్ల పరుగు ఇక ఊపందుకోనుంది. ‘‘ఉత్తర, కొంకణ్‌ రైల్వేతోపాటు రైల్వేబోర్డుకు చెందిన సీనియర్‌ అధికారుల విస్తృత తనిఖీ అనంతరం సంగల్‌దాన్‌ నుంచి రామ్‌బన్‌ వరకు 46 కి.మీ.ల మేర విద్యుదీకరించిన లైనులో 40 కి.మీ.ల వేగంతో మెమూ రైలు నడిచింది’’ అని రైల్వే మంత్రిత్వశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సంగల్‌దాన్‌లో 12.35కు బయలుదేరిన రైలు తొమ్మిది సొరంగాలు దాటి 2.05కు రియాసీకి చేరింది. చీనాబ్‌ వంతెనపై జూన్‌ 16న ఓ రైలింజను ట్రయల్‌రన్‌ నిర్వహించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని