వడగాడ్పుల మృతులు 114 మంది

నైరుతి రుతుపవనాల్లో పదిరోజులపాటు నెలకొన్న స్తబ్దత, ఉత్తరాదిలో తీవ్రత తగ్గని వడగాల్పుల కారణంగా ఈ వేసవిలో ఇప్పటివరకు 114 మంది మృత్యువాత పడ్డారు.

Published : 21 Jun 2024 05:50 IST

వేసవిలో 41 వేల మంది ఆసుపత్రులపాలు 

దిల్లీ: నైరుతి రుతుపవనాల్లో పదిరోజులపాటు నెలకొన్న స్తబ్దత, ఉత్తరాదిలో తీవ్రత తగ్గని వడగాల్పుల కారణంగా ఈ వేసవిలో ఇప్పటివరకు 114 మంది మృత్యువాత పడ్డారు. మరో 40,984 మంది వడగాలుల బారినపడి ఆసుపత్రుల్లో చేరారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ వెల్లడించింది. దిల్లీలో 24 గంటల వ్యవధిలోనే 22 మంది చనిపోయినట్లు అధికారులు తొలుత ప్రకటించగా గురువారం రాత్రి సరికి ఆ సంఖ్య 45కి పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో 32 మందిని చేర్చగా వారిలో 26 మంది పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. యూపీలో 37 మంది చనిపోయారు. రాష్ట్రాల నుంచి తుది గణాంకాలు అందిన తర్వాత ఈ సంఖ్యలు ఇంకా పెరగవచ్చని అధికార వర్గాలు తెలిపాయి. పరిస్థితిని ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధతతో ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ఆదేశించారు. 

ఉత్తరాది వైపు కదిలిన రుతుపవనాలు 

నైరుతి రుతుపవనాలు దాదాపు 10 రోజుల విరామం తర్వాత ఉత్తరాది వైపు కదలడం ప్రారంభించాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో కొన్ని ప్రాంతాలకు, విదర్భలోని అన్నిప్రాంతాలకు ఇవి విస్తరించాయి. మూడు నాలుగు రోజుల్లో మరిన్ని రాష్ట్రాలకు రుతుపవనాలు చేరుకోనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని