మోదీతో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల భేటీ

కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీకి అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంపై ప్రశంసలు కురిపించింది.

Published : 21 Jun 2024 05:51 IST

దిల్లీ: కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టిన ప్రధాని మోదీకి అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధుల బృందం అభినందనలు తెలిపింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంపై ప్రశంసలు కురిపించింది. గురువారం దిల్లీలో ఈ బృందం ప్రధానితో భేటీ అయింది. ఏడుగురు సభ్యుల అమెరికా బృందానికి విదేశీ వ్యవహారాల సభా కమిటీ ఛైర్మన్‌ మైఖేల్‌ మెక్‌ కాల్‌ నాయకత్వం వహిస్తున్నారు. వాణిజ్యం, సరికొత్త సాంకేతికతలు, రక్షణ, సాంస్కృతిక మార్పిడి వంటి అంశాల్లో రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వ్యూహాత్మక బంధానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని మోదీకి వారు హామీ ఇచ్చారు. అమెరికా ప్రతినిధులతో దిగిన ఫొటోను ప్రధాని తన ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ బృందంలో మాజీ స్పీకర్‌ నాన్సీ పెలోసీ, మిల్లర్, గ్రెగరీ మీక్స్, నికోల్, జిమ్‌ మెక్‌ గోవర్న్, అమీ బెరా ఉన్నారు.

 

 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని