ఖలిస్థానీ ఉగ్రవాదితో సంబంధం.. కీలక కార్యకర్త అరెస్టు

కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాదితో సంబంధం ఉన్న ఓ కీలక కార్యకర్తను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.

Published : 21 Jun 2024 05:51 IST

దిల్లీ: కెనడాకు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాదితో సంబంధం ఉన్న ఓ కీలక కార్యకర్తను గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన సోదాల సందర్భంగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్‌ జిల్లాకు చెందిన జస్‌ప్రీత్‌ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌(బీకేఐ)పై ఎన్‌ఐఏ గురువారం పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి ఉగ్రవాది లఖ్బీర్‌ సింగ్‌ సంధూ అలియాస్‌ లండాతో సంబంధం ఉన్న జస్‌ప్రీత్‌ను అరెస్టు చేసింది. పది మంది అనుమానితుల్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌ రాష్ట్రాల్లో పలుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ కుట్రల్లో లండా ప్రమేయం ఉన్నట్టు ఎన్‌ఐఏ గతంలో చేపట్టిన దర్యాప్తులో తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని