రాష్ట్రపతి పుట్టినరోజు.. శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గురువారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆదర్శప్రాయమైన సేవ, దేశం పట్ల ఆమెకున్న అంకితభావం అందరికి స్ఫూర్తిదాయకం.

Published : 21 Jun 2024 05:47 IST

దిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 66వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోదీ గురువారం ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆదర్శప్రాయమైన సేవ, దేశం పట్ల ఆమెకున్న అంకితభావం అందరికి స్ఫూర్తిదాయకం. ఆమె జీవిత ప్రయాణం కొన్ని కోట్ల మందికి భరోసానిచ్చింది. దూరదృష్టి గల ఆమె నాయకత్వానికి, అలసట లేని ప్రయత్నాలకు దేశం ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. ఆమె ఆయురారోగ్యాలతో జీవించాలి’ అని ఎక్స్‌ వేదికగా మోదీ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ దంపతులు రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు, కాంగ్రెస్‌ పార్టీ సైతం ముర్ముకు శుభాకాంక్షలు తెలిపింది. భారతదేశ పురోగతి, సంక్షేమం, న్యాయం పట్ల రాష్ట్రపతికి ఉన్న సహజమైన జ్ఞానం, దృఢమైన నిబద్ధతతో భారతీయులకు మార్గనిర్దేశం చేస్తూనే ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్‌’ వేదికగా కోరారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 1958, జూన్‌ 20న ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా ఉపర్బెడా గ్రామంలో జన్మించారు. 2022 జులై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని