భానుడి భగభగల నుంచి దిల్లీకి ఉపశమనం

దేశ రాజధాని దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో విపరీతమైన వేడిమితో సతమతమవుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించినట్లైంది.

Published : 22 Jun 2024 05:49 IST

తేలికపాటి వర్షంతో చల్లబడిన వాతావరణం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి వర్షం కురిసింది. దీంతో విపరీతమైన వేడిమితో సతమతమవుతున్న ప్రజలకు కాస్తంత ఉపశమనం లభించినట్లైంది. శుక్రవారం దిల్లీ గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే రెండు డిగ్రీలు అధికంగా 40.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. తేలికపాటి వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాల్లో నీరు నిలిచింది. ఎన్‌సీఆర్‌ పరిధిలోని 13 ప్రాంతాల్లో నీరు నిలిచినట్లు నగరపాలక సంస్థ వర్గాలు తెలిపాయి. చెట్లు కూలినట్లు 9 ఫిర్యాదులు అందాయి. ఈ శని, ఆదివారాల్లో దిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, అందువల్ల తీవ్రవేడిమి నుంచి ఉపశమనం లభిస్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తీవ్రమైన వేడి గాలులు, నీటి సంక్షోభంతో ప్రస్తుతం దిల్లీ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. 

143కు చేరిన వేడిగాలుల మృతుల సంఖ్య

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ నుంచి జూన్‌ 20 వరకు వేడిగాలుల కారణంగా 143 మరణాలు సంభవించాయని, 41,789 మంది వడదెబ్బకు గురయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రాష్ట్రాల నుంచి సమీకరించిన డేటాను నవీకరించనందున మరణాల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని