కంది, సెనగ పప్పు నిల్వలపై పరిమితులు

బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై  పరిమితులు విధించింది.

Published : 22 Jun 2024 06:03 IST

ధరల నియంత్రణకు కేంద్రం చర్య

దిల్లీ: బహిరంగ మార్కెట్లో కంది, సెనగ పప్పులు, కాబూలీ సెనగల ధరలు పెరిగిపోకుండా, నిల్వదారులు సరకును దాచిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వాటి నిల్వలపై  పరిమితులు విధించింది. ఇందుకు సంబంధించి శుక్రవారం నుంచే అమలయ్యేలా ఉత్తర్వును జారీ చేసింది. ఆ ప్రకారం ఆయా సరకును టోకు వర్తకులు 200 టన్నులు, చిల్లర వ్యాపారులు 5 టన్నులు, భారీ గొలుసుకట్టు వ్యాపార నిర్వాహకులు 200 టన్నులు, మిల్లర్లు తమ మిల్లింగ్‌ సామర్థ్యంలో 25 శాతం లేదా గడచిన మూడు నెలల ఉత్పత్తిలో ఏది ఎక్కువైతే అంతమేర చొప్పున, దిగుమతిదారులు కస్టమ్స్‌ అనుమతులు పొందిన 45 రోజుల వరకూ తమ వద్ద పప్పుధాన్యాల నిల్వలను కలిగి ఉండొచ్చు. వినియోగదారులకు అందుబాటు ధరల్లో పప్పులను ఉంచేందుకు, అక్రమ నిల్వలను అడ్డుకునేందుకు, వదంతులను నిలువరించేందుకు కేంద్రం తాజా చర్యకు ఉపక్రమించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సెప్టెంబరు 30, 2024 వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి. ఈ క్రమంలో సంబంధిత సంస్థలన్నీ తమ వద్ద గల నిల్వల వివరాలను వినియోగ వ్యవహారాల శాఖకు చెందిన పోర్టల్‌లో వెల్లడించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని