జమ్మూకశ్మీర్‌ వేర్పాటువాద సంస్థలపై నిషేధానికి ‘ఉపా’ కోర్టు సమర్థన

జమ్మూకశ్మీర్‌కు చెందిన ముస్లింలీగ్‌ (మసరత్‌ ఆలం వర్గం), తెహ్రీక్‌ ఏ హురియత్‌ సంస్థలపై అయిదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శనివారం ‘ఉపా’ కోర్టు సమర్థించింది.

Published : 23 Jun 2024 04:43 IST

దిల్లీ: జమ్మూకశ్మీర్‌కు చెందిన ముస్లింలీగ్‌ (మసరత్‌ ఆలం వర్గం), తెహ్రీక్‌ ఏ హురియత్‌ సంస్థలపై అయిదేళ్లపాటు నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని శనివారం ‘ఉపా’ కోర్టు సమర్థించింది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సచిన్‌ దత్తాతో కూడిన ఈ ఏకసభ్య ట్రైబ్యునల్‌ను ఉగ్రవాద నిరోధక చట్టం కింద గత జనవరిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 2023 డిసెంబరులో పై సంస్థలపై విధించిన నిషేధం వెనుక తగినంత కారణం ఉందా అనే విషయాన్ని ఈ ట్రైబ్యునల్‌ పరిశీలించింది. నిషేధాన్ని సమర్థించిన ధర్మాసనం.. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌ను పాకిస్థాన్‌లో విలీనం చేసి, ఇస్లామిక్‌ పాలనను తీసుకురావడానికి ఈ రెండు సంస్థలు సరిహద్దుకు అవతల నుంచి అందుతున్న సాయంతో లోయలో వేర్పాటువాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని పేర్కొంది. పాక్‌కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కర్‌ ఏ తైబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌ల నుంచి అందుతున్న మద్దతుతో ఈ సంస్థలు కశ్మీర్‌లో ఉగ్రవాదం పెంచుతున్నాయన్న కేంద్రం వాదనను సైతం ధర్మాసనం సమర్థించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని