బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ మృతి

అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌(86) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

Published : 23 Jun 2024 04:52 IST

వారణాసి: అయోధ్యలోని రామమందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన ప్రధాన అర్చకుడు ఆచార్య లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌(86) శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో ఆయన పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. వారణాసిలో ఉన్న పండితుల్లో లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ను అగ్రగణ్యులుగా భావిస్తారు. ఆయన పూర్వీకులది మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా కాగా.. కుటుంబ సభ్యులు కొన్ని తరాలుగా వారణాసిలోనే నివసిస్తున్నారు. లక్ష్మీకాంత్‌ మృతి పట్ల ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహిత్య ప్రపంచంలో ఆయన మరణం తీరని లోటు అవుతుందన్నారు. భారతీయ సంస్కృతికి, సంస్కృత భాషకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ‘ఎక్స్‌’ వేదికగా కొనియాడారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు