బిహార్‌లో కూలిన మరో వంతెన

బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతున్న ఘటనలు కొనసాగుతున్నాయి.

Published : 24 Jun 2024 05:12 IST

వారంలో ఇది మూడోది

మోతిహరి: బిహార్‌లో నిర్మాణంలో ఉన్న వంతెనలు కూలిపోతున్న ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా తూర్పు చంపారణ్‌ జిల్లా మోతిహరిలోని ఘోడాసహన్‌ బ్లాక్‌లో ఆదివారం మరో వంతెన కుప్పకూలింది. వారంలో ఇది మూడో సంఘటన కావడం గమనార్హం. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. అమ్వా గ్రామంతో బ్లాక్‌లోని ఇతర ప్రాంతాలను అనుసంధానించేందుకు ఉద్దేశించి గ్రామీణ పనుల విభాగం (ఆర్‌డబ్ల్యూడీ) ఓ కాలువపై 16 మీటర్ల పొడవైన వంతెన నిర్మాణం చేపట్టింది. ఇందుకు రూ.1.5 కోట్లు వెచ్చిస్తోంది. అయితే నిర్మాణం పూర్తికాక ముందే కుప్పకూలింది. ఇందుకు సరైన కారణం తెలియరాలేదని ఆర్‌డబ్ల్యూడీ అదనపు ప్రధాన కార్యదర్శి దీపక్‌ కుమార్‌ సింగ్‌ వెల్లడించారు. ఈ వంతెన నిర్మాణానికి గతంలో స్థానికులు అడ్డుపడ్డారు. దీంతో వారే కూల్చేసి ఉంటారా? అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని