పన్నా రైతుకు దొరికిన రూ.25 లక్షల వజ్రం

వజ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ రైతుకు తాను లీజుకు తీసుకున్న గనిలో విలువైన వజ్రం దొరికింది.

Published : 24 Jun 2024 05:44 IST

జ్రాలకు ప్రఖ్యాతిగాంచిన మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఓ రైతుకు తాను లీజుకు తీసుకున్న గనిలో విలువైన వజ్రం దొరికింది. రాత్రికి రాత్రి రూ.25 లక్షలు కలిసిరావడంతో ఆ రైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పట్టి బజారియా గ్రామానికి చెందిన దేశ్‌రాజ్‌ అనే రైతుకు లీజుకు తీసుకున్న గనిలో 6.65 క్యారెట్ల ఈ డైమండ్‌ దొరికింది. వెంటనే ఆ వజ్రాన్ని పన్నా డైమండ్‌ ఆఫీసులో దేశ్‌రాజ్‌ డిపాజిట్‌ చేశాడు. త్వరలో జరగనున్న వజ్రాల వేలంలో దీనిని ఉంచుతామని పన్నా డైమండ్‌ ఆఫీసు అధికారులు తెలిపారు. వేలంలో ఈ వజ్రం సుమారు రూ.25 లక్షల వరకు పలుకుతుందని అంచనా వేశారు. ఇదే రైతుకు గతంలోనూ ఓసారి వజ్రం దొరికింది. మరోసారి రూ.లక్షల విలువైన వజ్రం దొరకడంతో అతడికి కాసుల పంట పండింది.  

ఈటీవీ భారత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని