ముంబయిలో హోర్డింగ్‌ల కుంభకోణం

ముంబయిలోని హోర్డింగ్‌ల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని మహారాష్ట్ర భాజపా నాయకుడు కిరీట్‌ సోమయ్య ‘ఎక్స్‌’లో ఆదివారం సంచలన ఆరోపణలు గుప్పించారు. గత నెలలో భారీ హోర్డింగ్‌ కూలిపోయి.. 17 మంది కన్నుమూసిన విషయం తెలిసిందే.

Published : 24 Jun 2024 05:00 IST

పలువురు అధికారులకు లంచాలు
మహారాష్ట్ర భాజపా నాయకుడి సంచలన ఆరోపణలు

ముంబయి: ముంబయిలోని హోర్డింగ్‌ల విషయంలో భారీ కుంభకోణం జరిగిందని మహారాష్ట్ర భాజపా నాయకుడు కిరీట్‌ సోమయ్య ‘ఎక్స్‌’లో ఆదివారం సంచలన ఆరోపణలు గుప్పించారు. గత నెలలో భారీ హోర్డింగ్‌ కూలిపోయి.. 17 మంది కన్నుమూసిన విషయం తెలిసిందే. దాని గురించి సోమయ్య వివరిస్తూ ‘ఆ హోర్డింగ్‌కు అనుమతి ఇచ్చింది రైల్వే పోలీస్‌ కమిషనర్‌ ఖురేషీ ఖలీద్‌. దీని నిమిత్తం ఈగో మీడియా ఏజెన్సీ నిర్వాహకుడు భవేశ్‌ భిండే.. ఖురేషీ భార్య నిర్వహిస్తున్న సంస్థకు రూ. 46 లక్షలు లంచంగా ఇచ్చారు’ అని ఆరోపించారు. అంతే కాకుండా సుమారు 24 హోర్డింగ్‌ల ఏర్పాటుకు బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్, రైల్వే పోలీసు శాఖలకు చెందిన పలువురు ఉద్యోగులకు ఆ యాడ్‌ సంస్థ సుమారు రూ.5 కోట్లను లంచాలుగా ఇచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ వీటన్నింటినీ కనుగొందని సోమయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో ఖలీద్‌ను వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్‌ చేయాలని ఉపముఖ్యమంత్రి దేవేంద్ర  ఫడణవీస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని