అస్సాం వరదలు.. 1.17 లక్షల మందికి అవస్థలు

అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా భయంకరంగానే కొనసాగుతోంది. పది జిల్లాలోని 1.17 లక్షల మందికి పైగా వరదల్లోనే కొట్టుమిట్టాడుతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

Published : 24 Jun 2024 05:03 IST

గువాహటి: అస్సాంలో వరదల పరిస్థితి ఇంకా భయంకరంగానే కొనసాగుతోంది. పది జిల్లాలోని 1.17 లక్షల మందికి పైగా వరదల్లోనే కొట్టుమిట్టాడుతున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఆదివారం ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. 968 గ్రామాలు ముంపునకు గురైనట్లు ప్రకటించారు. అధికారులు ఏర్పాటు చేసిన 134 సహాయ శిబిరాలు, 94 సహాయ పంపిణీ కేంద్రాల్లో 17,661 మంది ఆశ్రయం పొందుతున్నట్లు తెలిపారు. మరోవైపు, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఆదివారం కురిసిన కుంభవృష్టి కారణంగా వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు వారాలుగా కురుస్తున్న వర్షాలు కాస్త తెరపినివ్వడంతో రెండ్రోజుల నుంచి వరదలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆదివారం మళ్లీ భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రదేశాల్లో వరదలు సంభవించాయి. అనేక వాహనాలు రోడ్లపై చిక్కుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని