భాజపా అహంకారంతోనే దిల్లీ ప్రజలకు ఇక్కట్లు

దేశ రాజధాని గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే  హరియాణా నుంచి అవసరమైన మేరకు నీటిని విడుదల చేయించి దిల్లీ వాసుల దాహం తీర్చాలి.

Published : 24 Jun 2024 05:07 IST

దేశ రాజధాని గతంలో ఎప్పుడూ చూడని స్థాయిలో నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని వెంటనే  హరియాణా నుంచి అవసరమైన మేరకు నీటిని విడుదల చేయించి దిల్లీ వాసుల దాహం తీర్చాలి. భాజపా అహంకారం, నియంతృత్వ పోకడల వల్ల దిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  నీటి సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఆతిశీ  చేపట్టిన నిరాహార దీక్షకు మేం సంఘీభావం తెలుపుతున్నాం.

డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి 


ఉద్యోగార్థుల జీవితాలతో ఆడుకుంటున్న మోదీ ప్రభుత్వం

మోదీ ప్రభుత్వం పరీక్షల వాయిదా,   రద్దు ద్వారా ఉద్యోగార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటోంది. దీని వెనుక అధికారుల నిర్లక్ష్యం కన్నా ప్రభుత్వ పెద్దల కుట్ర ఉన్నట్లు అనిపిస్తోంది. పరీక్షలు రద్దయితే, యువతకు ఉద్యోగాలివ్వాల్సిన బాధ్యత కూడా తప్పుతుంది. ప్రశ్నపత్రాలు లీక్‌ కావడం, పరీక్షలు రద్దు కావడం.. ఇలా కాలయాపన జరుగుతూనే ఉంటుంది. ఉద్యోగాలు అందించే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోవడం మోదీ చెప్పకుండానే ఇచ్చిన గ్యారంటీ.

శశి థరూర్, కాంగ్రెస్‌ ఎంపీ 


బాలికల విద్యతోనే లింగ సమానత్వం

ప్రపంచంలోని నిరక్షరాస్యుల్లో మూడింట రెండొంతుల మంది మహిళలే. లింగ వివక్షకు ప్రధాన కారణాల్లో మహిళలకు తగిన స్థాయిలో విద్యావకాశాలు  అందకపోవడం కూడా ఒకటి. దీన్ని  రూపుమాపి లింగ సమానత్వం సాధించాలంటే అటు తల్లిదండ్రులు, ఇటు ప్రభుత్వాలు బాలికల విద్యను ప్రోత్సహించాలి. కానీ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది బాలికలు బడికి దూరంగా ఉన్నారు. ఒక్క దక్షిణాసియాలోనే పాఠశాలకు వెళ్లని బాలికల సంఖ్య 4.1 కోట్లు కావడం గమనార్హం. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.

ప్రపంచ బ్యాంకు


జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలంటే.. 

మెరుగైన ఆరోగ్యం, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపే వెసులుబాటు, నిరంతరం నేర్చుకొనే అవకాశం, స్థిరమైన కెరీర్‌ వృద్ధి, పనిలో ఉత్తమ ప్రదర్శనకు గుర్తింపు, అర్థవంతమైన స్నేహాలు, గందరగోళ  పరిస్థితుల్లోనూ మనశ్శాంతిగా ఉండగలిగే నేర్పు.. ఇవన్నీ ఉన్నవారు జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారు.

రణ్‌వీర్‌ అలహాబాదియా, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని