సంఘ విద్రోహుల చర్య ఇది.. దర్యాప్తునకు సహకరిస్తా: భోలే బాబా

యూపీలో హాథ్రస్‌ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు.

Published : 04 Jul 2024 06:21 IST

హాథ్రస్‌: యూపీలో హాథ్రస్‌ దుర్ఘటన జరిగిన ఒకరోజు అనంతరం దానిపై భోలే బాబా స్పందించాడు. తాను ఆ వేదిక నుంచి వెళ్లిపోయిన చాలా సమయం తర్వాతే ఆ తొక్కిసలాట చోటుచేసుకుందన్నాడు. ప్రభుత్వం చేపట్టే దర్యాప్తునకు సహకరిస్తానని ప్రకటించాడు. మంగళవారం నాటి దుర్ఘటన వెనక అసాంఘిక శక్తుల కుట్ర ఉందని ఆరోపించాడు. ఈ మేరకు అతని తరఫు న్యాయవాది బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే భక్తులను అతడి భద్రత సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాదం జరిగిన సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని