బిహార్‌లో ఒకే రోజు కుప్పకూలిన 3 వంతెనలు

నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్‌లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి.

Published : 04 Jul 2024 04:29 IST

15 రోజుల్లో తొమ్మిదో సంఘటన

సారణ్‌ జిల్లాలో కూలిపోతున్న వంతెన

పట్నా: నిర్మాణంలో ఉన్నవి..వినియోగంలో ఉన్నవి.. పాతవి అనే తేడా లేకుండా బిహార్‌లో వంతెనలు కుప్పకూలుతూనే ఉన్నాయి. బుధవారం ఏకంగా మూడు వారధులు నేలమట్టమయ్యాయి. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. రాష్ట్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో సంభవించిన వరదల కారణంగా సారణ్, సివాన్‌ జిల్లాల్లో 30 నుంచి 80 ఏళ్ల క్రితం నిర్మించిన ఆ వంతెనలు కూలిపోయాయని అధికారులు వెల్లడించారు. వాటి పునాదులు లోతుగా లేకపోవడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. తాజా ఘటనతో 15 రోజుల వ్యవధిలో రాష్ట్రంలో మొత్తం తొమ్మిది వంతెనలు ధ్వంసమయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని