గజరాజులకు అదిరిపోయే డెన్‌

ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్‌. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట.

Updated : 04 Jul 2024 09:35 IST

భువనేశ్వర్, న్యూస్‌టుడే: ఆ ఆరు ఏనుగులకూ అక్కడ రాజభోగాలే... ఉదయమే కాసేపు నడక, వ్యాయామం. 8:30కు అరటి పండ్లు, కొబ్బరి బొండాలు, క్యారెట్, చెరకు గడలు, పుచ్చకాయలతో టిఫిన్‌. మధ్యాహ్నం గంటన్నర సేపు జలకాలాట. తర్వాత గోధుమలు, చోళ్లు, మొక్కజొన్నల పొడి, ఉలవలతో ఆహారం. మళ్లీ రాత్రికీ ఇదే మెనూ. రాత్రంతా నెమరువేయడానికి అరటిపళ్లు, అరటి బోదెలూ... ఒడిశాలోని భువనేశ్వర్‌ సమీపంలో ఉన్న చందకా అభయారణ్యంలో ఏనుగుల వైభోగం ఇది. మంద నుంచి తప్పిపోయిన ఈ ఆరు ఏనుగులను అధికారులు చేరదీసి ఇలా పోషిస్తున్నారు. ఈ అభయారణ్యం చుట్టు పక్కల పెరుగుతున్న పులుల   కదలికలను పసిగట్టడం, గ్రామాల మీద పడే ఏనుగుల గుంపులను అడవుల్లోకి తరమడానికి వీటికి  శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో గజరాజుకు ఆహారం ఖర్చు రోజుకు రూ.1,500 అవుతోందని అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని