రుతుపవనాల సమయంలోనూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది.

Published : 04 Jul 2024 05:57 IST

దేశ జీడీపీపై ప్రభావం చూపే అవకాశం 

దిల్లీ: రుతుపవనాల సమయంలో తీవ్రమైన తేమతో కూడిన వేడికి గురవుతున్న వారి సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది. ఈ రకమైన వాతావరణ ప్రభావానికి గురవతున్న వారి సంఖ్య 1951-2020 మధ్యకాలంలో 67 కోట్లకు చేరిందని తెలిపింది. ఈ అధ్యయనంలో అమెరికాలోని కార్నెల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. రుతుపవనాల కాలంలో తేమతో కూడిన ఉష్ణోగ్రతల పెరగడం.. ఉత్పాదకతపై తీవ్రప్రభావం చూపుతోందని అధ్యయనం ఆందోళన వ్యక్తం చేసింది. సింధు-గంగా మైదాన ప్రాంతం ఈ తరహా వాతావరణానికి ఎక్కువ ప్రభావితమవుతోందని తెలిపింది. రుతుపవనాల సమయంలో వేడి పరిస్థితులు ప్రజల ఆరోగ్యానికి, కార్మికుల ఉత్పాదకతకు సవాలుగా నిలిచాయని పేర్కొంది. కార్మికుల పనిగంటలను మార్చాల్సిన అవసరం ఉందని తెలిపింది. ‘‘గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా 3 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగినా కార్మికుల ఉత్పాదకత 7 శాతం తగ్గుతుంది. తద్వారా భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 4 శాతం తగ్గే అవకాశం ఉంది’’ అని అధ్యయన రచయితలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని