యుద్ధ స్వరూపం మారుతోంది

సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు.

Published : 05 Jul 2024 05:04 IST

ఇందుకు భారత్‌ సిద్ధంగా ఉండాలి
త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ 

దిల్లీ: సాంకేతికంగా వస్తున్న మార్పులతో యుద్ధ రూపం వేగంగా మారుతోందని, దాన్ని అందుకోవడానికి సాయుధ బలగాలు సిద్ధంగా ఉండాలని భారత నూతన త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అన్నారు. 1999 కార్గిల్‌ యుద్ధంలో టైగర్‌ హిల్‌ను స్వాధీనం చేసుకోవడంలో 18 గ్రెనేడియర్స్‌ బెటాలియన్‌ కీలక పాత్ర పోషించింది. ఆ సంఘటనకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా గురువారం ఇక్కడ ఆర్మీ అధికారులు, జేసీఓలు, సైనికులను ఉద్దేశించి త్రిదళాధిపతి ప్రసంగించారు. ‘‘మన సామర్థ్యాలపై దేశ ప్రజలకు విశ్వాసం ఉంది. అదే మనకు గొప్ప ప్రతిష్ఠ తెచ్చిపెట్టింది. మనకు వచ్చిన వారసత్వం మన పూర్వీకులు సంపాదించింది. ఇందులో నేరుగా మన ప్రమేయం లేకున్నా.. దాని ఫలాలను పొందుతున్నాం. ఇది మనపై బాధ్యతలు పెట్టింది. ప్రస్తుతం మనం మార్పు చెందే యుగంలో ఉన్నాం. దాంతో యుద్ధ రూపం కూడా చాలా వేగంగా మారుతోంది. దానిని అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సుశిక్షితులైన సాయుధ బలగాలతో అగ్రగామి కావాలనేదే మన కోరిక. నూతనోత్సాహం, కొత్త శక్తి, ఆలోచనలతోనే అది సాధ్యం’’ అని చౌహాన్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని