మోదీ ‘పరీక్షా పే చర్చ’ వర్చువల్‌గా పునఃసృష్టి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్‌ రూపంలో వర్చువల్‌గా పునఃసృష్టించడానికి ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు ప్రారంభించింది.

Published : 05 Jul 2024 05:04 IST

ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు 

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏటా నిర్వహిస్తున్న ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక పోర్టల్‌ రూపంలో వర్చువల్‌గా పునఃసృష్టించడానికి ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు ప్రారంభించింది. పోటీ పరీక్షల్లో దేశవ్యాప్తంగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తడంతో ఈ పరీక్షల విశ్వసనీయతపై ప్రతిపక్షాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. నీట్‌ వ్యవహారంపైనా ‘పరీక్షా పే చర్చ’ లాంటి కార్యక్రమాన్ని ప్రధాని మోదీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక పోర్టల్‌ రూపొందించేందుకు వెండర్లను గుర్తించేందుకుగాను ఎన్‌సీఆర్‌టీ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ పోర్టల్‌ను విద్యార్థులు తమ ఇళ్ల నుంచే వీక్షించుకోవచ్చు. అందులో ప్రధాని మోదీ, మంత్రుల ప్రసంగాలు, విద్యార్థుల సృజనాత్మక ఆవిష్కరణలు, ప్రయోగాలు, ప్రాజెక్టులను నిక్షిప్తం చేస్తాం. ఈ వర్చువల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో ఎగ్జిబిషన్‌ హాలు, ఆడిటోరియం, సెల్ఫీ, క్విజ్‌ జోన్లు, లీడర్‌ బోర్డులు ఉంటాయి. విద్యార్థులు ఇంటరాక్టివ్‌ 2డీ/3డీ విధానంలో ప్రధానితో సెల్ఫీలు తీసుకోవచ్చు. వాటిని డౌన్‌లోడ్‌ చేసుకొని, సోషల్‌ మీడియాలోనూ పోస్టు చేయవచ్చు. వర్చువల్‌ ఆడిటోరియంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసేలా చర్చలు, అవగాహన సదస్సులు జరుగుతాయి’’ అని ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. ఈ పోర్టల్‌ను ఏడాదికి కోటిమంది వీక్షించే అవకాశం ఉంటుందని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని