కుటుంబాన్ని కలవవచ్చు.. దిల్లీ వదిలి వెళ్లకూడదు

ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమృత్‌పాల్‌ సింగ్‌ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్‌ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది.

Published : 05 Jul 2024 06:13 IST

అమృత్‌పాల్‌కు కోర్టు ఆదేశం

దిల్లీ: ఖలిస్థాన్‌ సానుభూతిపరుడు, పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైన అమృత్‌పాల్‌ సింగ్‌ ఎంపీగా ప్రమాణం చేయడానికి పెరోల్‌ ఇచ్చిన న్యాయస్థానం 10 షరతులు విధించింది. కుటుంబ సభ్యులను కలవవచ్చని, దిల్లీని వదిలి మాత్రం ఎక్కడకూ వెళ్లకూడదని పేర్కొంది. దిల్లీలో ఉన్నప్పుడు సింగ్‌ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఏ రూపంలోనూ మీడియావద్ద ప్రకటనలు చేయకూడదని పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా మెజిస్ట్రేట్‌ జారీచేసిన పెరోల్‌ ఉత్తర్వులు స్పష్టంగా చెబుతున్నాయి. అమృత్‌పాల్‌ శుక్రవారం ఎంపీగా ప్రమాణం చేయనున్నారు. అస్సాంలోని డిబ్రూగఢ్‌ కారాగారం నుంచి దిల్లీకి వెళ్లి, తిరిగి కారాగారానికి చేరుకునేందుకు పట్టే ప్రయాణ సమయంతో కలిపి శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు పెరోల్‌ను కోర్టు ఇచ్చింది. ‘వారిస్‌ పంజాబ్‌ దే’ అధిపతి అయిన ఆయన తన అనుచరుడిని పోలీసు కస్టడీ నుంచి విడిపించుకునే ప్రయత్నంలో ఆయుధాలతో దాడి చేసినందుకు ఫిబ్రవరి 23న అరెస్టై జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని