అడ్డా కూలీలకు గౌరవమివ్వాలి

కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

Published : 05 Jul 2024 05:26 IST

వారికి పూర్తి హక్కులను కల్పించాలి 
అది నా జీవిత లక్ష్యం: రాహుల్‌ 

దిల్లీ: కాయ కష్టం చేసే అడ్డా కూలీలకు పూర్తి హక్కులను కల్పించాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని, అది తన జీవిత లక్ష్యమని కాంగ్రెస్‌ అగ్ర నేత, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. దిల్లీలోని గురు తేగ్‌ బహదూర్‌ నగర్‌లో (జీటీబీ నగర్‌) గురువారం ఆయన భవన నిర్మాణ కార్మికులైన అడ్డా కూలీలను కలిశారు. వారి సమస్యలను విన్నారు. భవన నిర్మాణ ప్రదేశంలో తాపీ పట్టి కొద్దిసేపు వారితో కలిసి పని చేశారు. ఆ తర్వాత తన వాట్సప్‌ ఛానల్‌లో ఆ చిత్రాలను పంచుకున్నారు. అడ్డా కూలీలను కలిశాక పని ప్రదేశంలో వారికి ఏ మాత్రం గౌరవం లేదని తాను గతంలో అన్న మాటలు వాస్తవమేనని నిర్ధారణ అయ్యాయని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు