వైద్యులకు రక్షణ కల్పించండి

వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 26వ సెక్షన్‌ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది.

Published : 06 Jul 2024 04:36 IST

- ప్రధాని మోదీకి ఐఎంఏ లేఖ

దిల్లీ: వైద్య పరంగా నేరపూరిత నిర్లక్ష్యం జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేసే అధికారి వైద్యులకు రక్షణ కల్పిస్తున్న భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) 26వ సెక్షన్‌ను వినియోగించేలా చూడాలని భారత వైద్య మండలి (ఐఎంఏ) ప్రధాని మోదీకి లేఖ రాసింది. చికిత్సా సమయంలో రోగి మరణిస్తే అది హత్య కిందకు రాదని సాక్షాత్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాయే పార్లమెంటులో పేర్కొన్నారని ఐఎంఏ గుర్తు చేసింది. వైద్యుడి నిర్లక్ష్యం వల్ల రోగి చనిపోయే సందర్భాలు అరుదుగా జరుగుతాయని, అలాంటి సందర్భాల్లో దర్యాప్తు అధికారి నిపుణుల అభిప్రాయాన్ని స్వీకరించాలని సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని