స్వలింగ వివాహాలకు గుర్తింపు నిరాకరించిన తీర్పు సమీక్షకు అభ్యర్థన

స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది.

Published : 06 Jul 2024 04:36 IST

10న పరిశీలించనున్న సుప్రీంకోర్టు

దిల్లీ: స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు కల్పించటానికి నిరాకరిస్తూ గత ఏడాది అక్టోబరు 17న వెలువరించిన తీర్పును సమీక్షించాలన్న అభ్యర్థనలను పరిశీలించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. దీని కోసం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నెల 10న వీటిని పరిశీలించనుంది. ఈ ధర్మాసనంలో జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.వి.నాగరత్న, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహ సభ్యులుగా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని