సింగరేణి నైనిబ్లాక్‌కు అనుమతులపై కిషన్‌రెడ్డి హర్షం

ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు.

Published : 06 Jul 2024 04:36 IST

ఈనాడు, దిల్లీ: ఒడిశాలోని అంగుల్‌ జిల్లాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైని బొగ్గు గని తవ్వకాలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇవ్వడంపట్ల కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సింగరేణి సంస్థ ఇక్కడి నుంచి ఏటా 10 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి వీలవుతుందన్నారు. 2015లోనే ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించినా వివిధ పాలనాపరమైన అడ్డంకుల కారణంగా ఉత్పత్తి సాధ్యంకాలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేయడాన్ని స్వాగతిస్తూ..ఒడిశా ముఖ్యమంత్రి మోహన్‌ మాంఝీకి ధన్యవాదాలు తెలిపారు. నైని బ్లాక్‌లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత తెలంగాణలో విద్యుత్తు ఉత్పత్తికి మరింత భద్రత లభిస్తుందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని