ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి

సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సూచించారు.

Published : 06 Jul 2024 04:38 IST

జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సూచన

దిల్లీ: సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న కేసులను వేగంగా, సామరస్యంగా పరిష్కరించడానికి ఈ నెల 29 నుంచి ఆగస్టు 3 వరకు ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహిస్తున్నామనీ, పెండింగు కేసులు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ సూచించారు. సుప్రీంకోర్టు ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో ఇదీ ఒకటని కోర్టు వెబ్‌సైట్‌ లో వీడియో సందేశం ద్వారా ఆయన తెలియజేశారు. కక్షిదారులు ఉభయులకూ అంగీకారయోగ్యంగా, స్వచ్ఛందంగా వివాదాల పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఉపకరిస్తుందని వివరించారు. కాబట్టి సుప్రీంకోర్టులో పెండింగు కేసులున్న పౌరులు, వారి న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని