శారీరకంగా దృఢంగా ఉన్నా: దలైలామా

తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు.

Published : 07 Jul 2024 06:35 IST

89వ పడిలోకి అడుగుపెట్టిన బౌద్ధ గురువు

ధర్మశాల, దిల్లీ: తాను శారీరకంగా దృఢంగా ఉన్నానని.. బుద్ధుని బోధనల వ్యాప్తికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని బౌద్ధ గురువు దలైలామా పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆయన మోకాలి మార్పిడి శస్త్రచికిత్స పూర్తిచేసుకొని కోలుకుంటున్నారు. శనివారం 89వ పడిలోకి అడుగు పెట్టిన ఆయన ఈ మేరకు జన్మదిన సందేశం విడుదల చేశారు. ‘‘నేను 90కి సమీపంలో ఉన్నా. కాళ్లలో చిన్న అసౌకర్యం తప్ప ఎలాంటి అనారోగ్యం లేదు. నా జన్మదినం సందర్భంగా ప్రార్థనలు చేసిన టిబెటన్లందరికీ ధన్యవాదాలు’’ అని సందేశంలో పేర్కొన్నారు. ధర్మశాలలోని మైక్లోడ్‌గంజ్‌లో జరిగిన దలైలామా జన్మదిన వేడుకలకు సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్‌ తమాంగ్‌ తదితరులు హాజరయ్యారు. 

22న ‘ద బుక్‌ ఆఫ్‌ కంపాషన్‌’ పుస్తకావిష్కరణ

నేటి కాలంలో కరుణ ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఇద్దరు నోబెల్‌ పురస్కార గ్రహీతలు దలైలామా, కైలాశ్‌ సత్యార్థి, రచయిత పూజా పాండేతో కలిసి ముందుకు వస్తున్నారు. వీరిద్దరూ స్వేచ్ఛ, సంతోషం, అసమానతలు, అన్యాయం, వాతావరణ మార్పులు తదితర అంశాలపై తమ అభిప్రాయాలను ‘‘ద బుక్‌ ఆఫ్‌ కంపాషన్‌’’ అనే పుస్తకంలో వెల్లడించనున్నారు. జులై 22న దీన్ని విడుదల చేయనున్నట్లు ప్రచురణ సంస్థ పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఇండియా(పీఆర్‌హెచ్‌ఐ) తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని