నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన సైన్యం

జమ్మూకశ్మీర్‌లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు.

Published : 07 Jul 2024 04:46 IST

ఉగ్రవాదుల కాల్పుల్లో అమరులైన ఇద్దరు జవాన్లు

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో శనివారం రెండు వేర్వేరు చోట్ల ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో నలుగురు ఉగ్రవాదుల్ని భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఇద్దరు సైనికులూ ప్రాణాలు కోల్పోయారు. కుల్గామ్‌ జిల్లా ఫ్రిసల్‌ చిన్నిగామ్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో సైనికులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బందిపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇంకా ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయని.. ఘటనాస్థలి నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకోలేదని ఆర్మీ ప్రతినిధులు వెల్లడించారు. ఇదే జిల్లా మోడెర్గామ్‌ గ్రామంలో సాయుధ బలగాలు తనిఖీలు చేపడుతుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని