అనంత్, రాధికల సంగీత్‌ వేడుకలో.. జస్టిన్‌ బీబర్, బాలీవుడ్‌ తారల తళుకు

దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ఇంట అనంత్‌ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగిన ‘సంగీత్‌’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ (30)తోపాటు బాలీవుడ్‌ తారలు సల్మాన్‌ఖాన్, రణవీర్‌ సింగ్,

Published : 07 Jul 2024 06:34 IST

ముంబయి: దిగ్గజ వ్యాపారవేత్త ముకేశ్‌ అంబానీ ఇంట అనంత్‌ - రాధికల ముందస్తు పెళ్లి వేడుకలు జోరుగా సాగుతున్నాయి. జియో కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా జరిగిన ‘సంగీత్‌’ కార్యక్రమంలో కెనడాకు చెందిన పాప్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ (30)తోపాటు బాలీవుడ్‌ తారలు సల్మాన్‌ఖాన్, రణవీర్‌ సింగ్, ఆలియాభట్, రణబీర్‌ కపూర్‌ తదితరులు తమ ప్రదర్శనలతో ఆహుతులను ఉర్రూతలూగించారు. ఈ వేడుక కోసం ప్రత్యేకంగా    భారత్‌కు వచ్చిన పాప్‌ సింగర్‌ బీబర్‌కు అంబానీ కుటుంబం రూ.83.5 కోట్ల (10 మిలియన్‌ డాలర్లు) పారితోషికం ఇచ్చింది. చిన్న వయసులోనే ‘ఓ బేబీ’ అంటూ అందర్నీ ఆకట్టుకున్న బీబర్‌ ‘సారీ’, ‘లవ్‌ యువర్‌సెల్ఫ్‌’ వంటి పాటలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. 2017లో భారత్‌లో సంగీత కచేరీ చేసిన ఆయన ఏడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు వచ్చారు. సంగీత్‌ కార్యక్రమానికి ఇంకా సినీ రంగం నుంచి దీపికా పదుకొణె, మాధురీ దీక్షిత్, అర్జున్‌ కపూర్, జాన్వీ కపూర్‌ తదితరులు తరలివచ్చారు. అనంత్‌ - రాధికల వివాహం ఈ నెల 12న జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని