ఖరారు కాని నీట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూలు

వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్‌ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది.

Published : 07 Jul 2024 04:48 IST

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడి

దిల్లీ: వైద్యవిద్యకు సంబంధించిన 2024 నీట్‌ యూజీ, పీజీ కోర్సుల కౌన్సెలింగు షెడ్యూలును మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (ఎంసీసీ) ఇంకా నోటిఫై చేయలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ శనివారం స్పష్టం చేసింది. పరీక్షల ప్రక్రియ ముగిసి, జాతీయ వైద్యమండలి (ఎన్‌ఎంసీ) సీట్ల సంఖ్యను ఖరారు చేశాక కౌన్సెలింగ్‌ షెడ్యూలును డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఆధ్వర్యంలో ఎంసీసీ తన వెబ్‌సైటు ద్వారా ప్రకటిస్తుందని తెలిపింది. యూజీ సీట్లపై జులై మూడో వారానికి, పీజీ సీట్లపై ఆగస్టు నెల మధ్యలో ఓ స్పష్టత వస్తుందని పేర్కొంది. దీని ఆధారంగా ఎంసీసీ కౌన్సెలింగ్‌ షెడ్యూలును నోటిఫై చేస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. నీట్‌-యూజీ కౌన్సెలింగును నిలిపివేసినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో కేంద్రం ఈ వివరణ ఇచ్చింది. 

విదేశీ వైద్య పరీక్షకు 35,819 మంది హాజరు

విదేశీ వైద్య పట్టభద్రుల పరీక్షకు శనివారం 35,819 మంది హాజరైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు దేశంలో వైద్య ప్రాక్టీసుకు అర్హులవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని