దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరు

హాథ్రస్‌ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్‌ పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు.

Published : 07 Jul 2024 04:50 IST

హాథ్రస్‌ తొక్కిసలాటపై స్పందించిన భోలే బాబా

నొయిడా: హాథ్రస్‌ తొక్కిసలాటకు బాధ్యులైన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని వివాదాస్పద సూరజ్‌ పాల్‌ అలియాస్‌ నారాయణ్‌ సాకార్‌ హరి అలియాస్‌ భోలే బాబా పేర్కొన్నారు. మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి అండగా ఉంటామని చెప్పారు. ఘటన జరిగిన నాటి నుంచీ అజ్ఞాతంలో ఉన్న ఆయన శనివారం మీడియా ముందుకు వచ్చారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘2వ తేదీ ఘటనతో నేను చాలా వేదనకు గురయ్యా. ఈ క్లిష్ట సమయంలో బాధితులకు ఆ భగవంతుడు తగు శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. తొక్కిసలాటకు బాధ్యులైనవారు శిక్ష నుంచి తప్పించుకోలేరని నేను నమ్ముతున్నా’ అని భోలే బాబా పేర్కొన్నారు. మరోవైపు ఆయనపై తొలి కేసు నమోదైంది. 

  • హాథ్రస్‌ తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడు దేవ్‌ప్రకాశ్‌ మధుకర్‌ను (42) శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలో అతడిని ఉత్తర్‌ ప్రదేశ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నిందితుడిని కొంత మంది రాజకీయ నాయకులు సంప్రదించినట్లు తెలిసింది. మరో ఇద్దరు నిందితులు రాంప్రకాశ్‌ శాక్య (61), సంజు యాదవ్‌లనూ (33) పోలీసులు అరెస్టు చేశారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని