సూరత్‌లో కుప్పకూలిన ఆరంతస్తుల భవనం

గుజరాత్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌ పట్టణంలోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు.

Published : 07 Jul 2024 04:51 IST

ఒకరి మృతి, శిథిలాల్లో నలుగురు

సూరత్‌:  గుజరాత్‌లో పెను ప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌ పట్టణంలోని పాల్‌ ప్రాంతంలో శనివారం ఓ ఆరంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోయారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది.. శిథిలాల నుంచి ఓ మహిళను ప్రాణాలతో కాపాడినట్లు సూరత్‌ కలెక్టర్‌ సౌరభ్‌ పార్దీ వెల్లడించారు. రాత్రి ఓ వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు చెప్పారు. శిథిలాల్లో ఇంకా నలుగురు చిక్కుకున్నారని తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు. 2016లో నిర్మించిన భవనం కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కూలిపోయినట్లు పోలీసులు తెలిపారు. సమీపంలోని ఫ్యాక్టరీల్లో పని చేసే కార్మికులు ఈ భవనంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని