మరో ఇద్దరు ఉగ్రవాదుల హతం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది.

Published : 08 Jul 2024 04:23 IST

ఇప్పటివరకు ఆరుగురిని మట్టుబెట్టిన భద్రతాదళాలు
కశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఇంకా కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లు

శ్రీనగర్‌/రాజౌరీ: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌ జిల్లాలో రెండు రోజులుగా రెండు గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో మృతి చెందిన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకి పెరిగింది. శనివారం నలుగురు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా దళాలు..ఆదివారం మరో ఇద్దరిని హతమార్చాయి. మోదర్గామ్‌ గ్రామంలో ఇద్దరు ముష్కరులు, ఫ్రీసల్‌ చిన్నిగామ్‌లో నలుగురు మృతి చెందినట్లు సైన్యం తెలిపింది. రెండు ప్రాంతాల్లో ఉగ్రవాదుల వేట ఇంకా కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ జంట ఎన్‌కౌంటర్లలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇందులో ఓ ఎలైట్‌ పారా కమాండో ఉన్నారు. భద్రతాదళాలకిది భారీ విజయం అని జమ్మూకశ్మీర్‌ డీజీపీ ఆర్‌.ఆర్‌.స్వైన్‌ పేర్కొన్నారు.

సైనిక శిబిరంపై కాల్పులు

జమ్మూకశ్మీర్‌లో రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు, సైన్యం రంగంలోకి దిగింది. గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని