310 పందులను చంపిన కేరళ

ఆఫ్రికన్‌ స్వైన్‌ జ్వరం (ఏఎస్‌ఎఫ్‌) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్‌ఎఫ్‌ను తొలుత త్రిశూర్‌ జిల్లాలోని మతకథరన్‌ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు.

Published : 08 Jul 2024 04:24 IST

ఆఫ్రికన్‌ స్వైన్‌ జ్వరం కట్టడికి రాష్ట్ర సర్కార్‌ చర్య

దిల్లీ: ఆఫ్రికన్‌ స్వైన్‌ జ్వరం (ఏఎస్‌ఎఫ్‌) వ్యాప్తిని కట్టడిచేసేందుకు కేరళ ప్రభుత్వం దాదాపు 310 పందులను చంపింది. ఏఎస్‌ఎఫ్‌ను తొలుత త్రిశూర్‌ జిల్లాలోని మతకథరన్‌ గ్రామంలో గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే స్పందించిన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ అధికారులు జులై 5న ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందం సాయంతో పందులను చంపి వాటి కళేబరాలను ఏఎస్‌ఎఫ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు కిలో మీటరు దూరంలో పారవేసినట్లు కేంద్ర మత్య్స, పశు, పాడి సంవర్ధక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధి కాదని స్పష్టంచేసింది. అయినప్పటికీ, ఏఎస్‌ఎఫ్‌ను నివారించే వ్యాక్సిన్‌ లేకపోవడంతో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్న ఆందోళనను వ్యక్తంచేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని