లోకోపైలట్ల పరిస్థితిని పార్లమెంటులో లేవనెత్తుతాం

రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చెప్పారు.

Published : 08 Jul 2024 04:25 IST

రాహుల్‌గాంధీ

దిల్లీ: రైల్వే లోకోపైలట్ల సమస్యల్ని విపక్ష ఇండియా కూటమి పార్లమెంటులో లేవనెత్తుతుందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ చెప్పారు. వారి హక్కులు, పని పరిస్థితులు మెరుగుపడేలా తమవంతు కృషి చేస్తామని ‘ఎక్స్‌’ ద్వారా తెలిపారు. కొత్తదిల్లీ రైల్వేస్టేషన్‌లో ఇటీవల లోకోపైలట్లతో మాట్లాడిన వీడియోను దీనికి జత చేశారు. ‘నరేంద్రమోదీ ప్రభుత్వంలో లోకోపైలట్ల జీవితం అనే రైలు పూర్తిగా పట్టాలు తప్పింది. వేడిమితో కూడిన క్యాబిన్‌లో కూర్చొని వారు రోజుకు 16 గంటలు కష్టపడాల్సి వస్తోంది. లక్షలమంది ప్రయాణికుల ప్రాణాలు వారిపై ఆధారపడి ఉన్నా తమ సొంత బతుకులపై భరోసా లేదు. మూత్రశాలల వంటి సదుపాయాలు వారికి లేవు. పనివేళలపై నియంత్రణ లేదు. సెలవులు దొరకవు. శారీరక, మానసిక అలసటతో వారు అస్వస్థులు అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వారితోపాటు ప్రయాణికుల ప్రాణాలకు కూడా ముప్పు పొంచిఉంది. నేను వారితో సాగించిన చర్చను వీడియోలో వింటే ఆ బాధలు మీకూ తెలుస్తాయి’ అని రాహుల్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని