రూ.10 లక్షలకు పెరగనున్న ఆయుష్మాన్‌ ఆరోగ్య బీమా

ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

Published : 08 Jul 2024 04:25 IST

దిల్లీ: ప్రతిష్ఠాత్మక ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని రూ.10లక్షలకు పెంచే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు రాబోయే మూడేళ్లలో ఈ పథకం కింద లబ్ధిపొందేవారి సంఖ్యను సైతం రెండితలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది. తొలుత 70 ఏళ్లు పైబడిన వారిని ఈ పథకంలో భాగం చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఏటా ఖజానాపై మరో రూ.12,076 కోట్ల భారం పడనుందని, దేశంలో మూడింట రెండొంతుల మందికి ఆరోగ్య బీమా వర్తించనుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నీ లేదా వీటిలో కొన్నింటిని రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయుష్మాన్‌ భారత్‌ యోజనను 70 ఏళ్లు పైబడిన వారికి సైతం విస్తరిస్తున్నట్లు జూన్‌ 27న జరిగిన పార్లమెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మరో 4-5 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూరే అవకాశం ఉంది. దేశంలో ఎటువంటి ప్రయోజనాలు పొందని 30శాతం మందిని సైతం ఈ బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని