బిహార్‌లో మరో వంతెన కూలింది: తేజస్వీ

బిహార్‌లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. తూర్పు చంపారన్‌ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

Published : 08 Jul 2024 04:25 IST

అది తాత్కాలిక  నిర్మాణమన్న అధికారులు

మోతీహారీ: బిహార్‌లో మరో వంతెన కూలిపోయినట్లు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ ఆరోపించారు. తూర్పు చంపారన్‌ జిల్లాలో కూలిన ఓ నిర్మాణానికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. నాణ్యత లేని పనుల వల్లే అది కూలినట్లు స్థానికులు చెప్పడం అందులో కనిపించింది. అయితే అది వంతెన కాదని, ఓ పెద్ద మురుగు కాలువపై నుంచి ప్రజలు వెళ్లడానికి నిర్మించిన తాత్కాలిక నిర్మాణమని జిల్లా మేజిస్ట్రేట్‌ పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా అది కొట్టుకుపోయినట్లు తెలిపారు. బిహార్‌లో ఇటీవల 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని