బయట నుంచి చూస్తే కప్‌బోర్డ్‌.. లోపల ఉగ్ర స్థావరం

జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటుచేసుకొన్నట్లు జవాన్లు గుర్తించారు.

Published : 09 Jul 2024 04:14 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులు బంకర్లు ఏర్పాటుచేసుకొన్నట్లు జవాన్లు గుర్తించారు. ఓ ఇంట్లో ఉన్న కప్‌బోర్డ్‌లోపల ఉగ్రవాదులు పూర్తిగా కాంక్రీట్‌తో బంకరు నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. చిన్నదిగా ఉన్నా సౌకర్యవంతంగా ఉన్నట్లు పేర్కొంది. దీనిలోకి వెళ్లడానికి బయట నుంచి చిన్న అల్మారా వంటి దానిలో ద్వారం ఏర్పాటుచేశారు. ఒక మనిషి పాక్కొంటూ బంకర్‌లోకి ప్రవేశించవచ్చు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ నేత ఒకరు ఎక్స్‌లో పోస్టు చేశారు. కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులు మరుగుదొడ్ల కింద బంకర్లు ఏర్పాటు చేసుకొంటున్నట్లు సైన్యం గుర్తించింది. దీంతో వాటిపై దృష్టిపెట్టింది. 2019లో లస్సీపుర వద్ద సైన్యం ఒక ఇంటిని అనుమానంతో ఆరుసార్లు తనిఖీ చేసినా ఏ ఆధారం దొరకలేదు. చివరికి సెప్టిక్‌ ట్యాంక్‌ను తెరవగా.. ఇద్దరు ఉగ్రవాదులు అందులోని బంకర్‌లో దాక్కొన్నట్లు గుర్తించారు. చాలా స్థావరాలు కిచెన్లు, బెడ్‌రూమ్‌లు, డ్రాయింగ్‌ రూమ్‌ల మాటున ఉంటున్నట్లు గమనించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని