విరాళాలను స్వీకరించొచ్చు.. శరద్‌ పవార్‌ పార్టీకి ఈసీ అనుమతి

శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) విరాళాలను స్వీకరించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది.

Published : 09 Jul 2024 03:41 IST

దిల్లీ: శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) విరాళాలను స్వీకరించడానికి ఎన్నికల సంఘం (ఈసీ) అనుమతి ఇచ్చింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ విరాళాలను స్వీకరించవచ్చని సోమవారం పేర్కొంది. ఇటీవల ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలను అంగీకరించడానికి అనుమతించాలని కోరుతూ ఎన్సీపీ (ఎస్పీ) ఈసీకి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో అనుమతి లభించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని