హానికారక వంట ఇంధనాలతో భారీ ముప్పు

భారత్‌లో హానికారక వంట ఇంధనాలతో శిశువులకు భారీ ముప్పు వాటిల్లుతోందని తేలింది. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 27 మంది వీటివల్ల మరణిస్తున్నారని వెల్లడైంది.

Published : 09 Jul 2024 03:48 IST

భారత్‌లో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 27 మంది వాటివల్లే మృతి

వాషింగ్టన్‌: భారత్‌లో హానికారక వంట ఇంధనాలతో శిశువులకు భారీ ముప్పు వాటిల్లుతోందని తేలింది. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 27 మంది వీటివల్ల మరణిస్తున్నారని వెల్లడైంది. అమెరికాలోని కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ ఆర్ణాబ్‌ బసు జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. ‘వంట ఇంధనం ఎంపిక.. భారత్‌లో శిశువుల మరణాలు’ అనే పేరుతో విడుదలైన ఈ నివేదికలో శిశువులపై 1992 నుంచి 2016 వరకూ జరిపిన అధ్యయన ఫలితాలున్నాయి. నెల లోపు శిశువులపై ఈ వంట ఇంధన ప్రభావం అధికంగా ఉందని వెల్లడైంది. బాలుర కంటే బాలికల్లోనే ఈ ప్రభావం ఎక్కువని అర్ణాబ్‌ బసు తెలిపారు. శిశువుల్లో సరిగా ఎదగని ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు