ఓ వ్యక్తిని రక్షించడానికి ఎందుకంత ఆసక్తి?

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది.

Published : 09 Jul 2024 03:49 IST

బెంగాల్‌ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీం 

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో చోటుచేసుకున్న అరాచకాలు, భూకబ్జాల ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేయాలంటూ కోల్‌కతా హైకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. సీబీఐ దర్యాప్తునకు వ్యతిరేకంగా రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఓ వ్యక్తిని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంత ఆసక్తి చూపుతోందని ఈ సందర్భంగా జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్, జస్టిస్‌ కె.వి.విశ్వనాథన్‌ ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు సమాధానంగా హైకోర్టు ఉత్తర్వుల్లో రాష్ట్ర ప్రభుత్వంపైనా వ్యాఖ్యలు ఉన్నాయని బెంగాల్‌ తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ మనుసింఘ్వి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని